
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి జిల్లా, రామచంద్రపురం మండలంలోని పరమాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆరిమాను గంగమ్మ ఆలయానికి గ్రామస్థుల అభ్యర్థన మేరకు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ 1200 చదరపు అడుగులు గ్రానైట్ (70,వేల రూపాయలు విలువ ) అందించారు స్వామిజీ కి చెప్పిన వెంటనే స్పందించి ఆలయం నిర్మాణం కోసం తన స్వంత నిధులతో గ్రానైట్ రాయిని అందించి తన తన ఉదారతను చాటుకున్నందుకు గ్రామస్థులు స్వామిజీకి ధన్యవాదాలు తెలిపారు



