Tuesday, March 17, 2026

రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ప్రతాప శ్రీనివాస్

నేటి సాక్షి, హుజురాబాద్ ( రాఘవుల శ్రీనివాసు): హుజరాబాద్ రైస్ మిల్ ఆపరేటర్ యూనియన్ మండల అధ్యక్షుడిగా ప్రతాప శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైస్ మిల్ ఆపరేటర్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి మేక శ్రీనివాసు, కోశాధికారి సారంగపాణి, ఉపాధ్యక్షులుగా మొగిలి, రవి, కుమారస్వామి, కుర్ర శ్రీనివాసు, సంపత్ రెడ్డి, నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ప్రతాప్ సురేష్, పల్లె శ్రీధర్, సమ్మయ్య, కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప శ్రీనివాస్ మాట్లాడుతూ… రైస్ మిల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను యజమానులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆపరేటర్లకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలన్నారు. మిల్లులో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆరోగ్య రక్షణ పరికరాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో రైస్ మిల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News