నేటి సాక్షి, సైదాపూర్:
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ఢ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సైదాపూర్ మండల అధ్యక్షులుగా నెల్లి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా పల్లెర్ల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులుగా పోతర వేణి గణేష్, మహిళా కార్యదర్శిగా అస్మా తబస్సుమ్ ను నియమిస్తూ పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పి ఆర్ టి యు టీజి సైదాపూర్ మండల అధ్యక్షునిగా ఎన్నికైన నెల్లి ప్రవీణ్ మండలంలోని ఆకునూరు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పల్లెర్ల శ్రీనివాస్ వెన్నంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన సైదాపూర్ మండల శాఖను పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాతూరి రాజ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోమటి శ్రీనివాస్ ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కలిగేటి లక్ష్మీనర్సయ్య, గొడిషాల మహేందర్ , కట్ట వేణుగోపాల చారి మరియు సైదాపూర్ మండలంలోని ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.