Wednesday, March 25, 2026

పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయండి

నేటిసాక్షి, బ్యూరో నిజామాబాద్, టి.ఎన్. రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, గణితం కాంప్లెక్స్ సమావేశము జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో, భౌతిక శాస్త్రము కాంప్లెక్స్ సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల సబ్జెక్టు టీచర్లు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాలలో ఎల్లారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఏ వెంకటేశం మాట్లాడుతూ, మార్చి 21 నుండి నిర్వహించబోయే పదవ తరగతి విద్యార్థులకు, విద్యార్థులను సంసిద్ధులను చేయాలని, పరీక్షల పట్ల భయం లేకుండా, నిర్భయంగా రాయాలని, పదో తరగతి పరీక్షల నిర్వహణలో వచ్చిన మార్పుల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈసారి ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ మరియు సీరియల్ నెంబర్ ముద్రించడం జరుగుతుందని, తెలియజేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News