Thursday, April 2, 2026

2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన

  • బాసు హనుమంతు నాయుడు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : పార్టీ తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కేసీఆర్,కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జంపన్న కుటుంబ సభ్యులు. పార్టీ కార్యకర్తలకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని బాసు హనుమంతు నాయుడు అన్నారు. సోమవారం గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని జాంపల్లె గ్రామానికి చెందిన జంపి రెడ్డి (జంపన్న) అనే బిఆర్‌ఎస్ కార్యకర్త కొద్దిరోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందారు..వారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా సభ్యత్వం నమోదు చేసుకోగా, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వారి స్వగృహానికి వెళ్లి,మృతుని భార్య పద్మమ్మకు 2లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు. అంతక ముందు,జంపన్న చిత్రపటానికి బాసు హనుమంతు నాయుడు పూలమాల వేసి,నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మోనేష్, నూర్ పాషా ,డి. శేఖర్ నాయుడు, శ్రీ రాములు, వెంకటేష్ నాయుడు, గంజీపేట రాజు, ఎస్. రాము నాయుడు, బాసు గోపాల్, రాజు నాయుడు, తిరుమలేష్, ముని మౌర్య,అబ్రహం, రవీందర్, నక్క రవి, శివ, రాజు, నల్ల గట్ల రాముడు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News