నేటిసాక్షి, రాయికల్ (సింగిడి కార్తీక్) : మాతృభాష తోనే విద్యార్థులకు సంపూర్ణ వికాసం లభిస్తుందని ఇటిక్యాల ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేశారు. మాతృభాషల పరిరక్షణ అందరి బాధ్యత. ఏ భాష అయిన వారి వారి సంస్కృతి సంప్రదాయాలు నాగరికతలకు అద్దం లాంటిదని, ఎన్ని భాషలు తెలిసిన భావోద్వేగాలు, ఆలోచనలు మొదటగా మెదిలేది మాతృభాష లోనేనని, మన మనసులో ఉద్భవించే ఆలోచనలను అత్యంత సహజంగా, స్పష్టంగా మాతృభాషలో వ్యక్తికరించగలిగినట్లు ఇతర భాషల్లో వ్యక్తి కరిగించలేమని, మాతృభాష లోనే విద్యాబోధన శ్రేయస్కరమని అన్నారు. మాతృభాషలలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజంగి రాజేశం, ముక్కెర శేఖర్, ఎద్దండి రమేష్ రెడ్డి, హన్మంతరావు, జియావుద్దీన్, ముజాహిద్, నాగలక్ష్మి, స్వర్ణలత, శ్రీలత, నీరజ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




