నేటి సాక్షి, వేమనపల్లి : గత కొన్ని రోజులుగా సుంపుటం సమీపంలో ఉన్న ప్రాణహిత రేవు ప్రాంతంలో పురాతన రూపమైన శిలాజ సంపదను అక్రమంగా మత్తడి వాగు వంతెన వద్దకు తరలిస్తున్నారని బిజెపి నాయకులు సదరు కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. సోమవారం రోజు రాజారాం గ్రామంలో దశవతరాల విగ్రహాలను బిజెపి నాయకులు సందర్శించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూ దశవతరాలు అతి ప్రాచీనమైన, చారిత్రకంగా కీలకమైనది అని ప్రాణహిత పరివాహిక ప్రాంతంలో ఈ పల్లెల్లో అనేక ప్రాచీన జీవరాశుల అవశేషాలు ఉన్నాయని వేమనపల్లి పేరు వినగానే మొదటగా డైనోసార్ శిలాజాలు, దశవతరాల విగ్రహాలు గుర్తుకువస్థాయనీ ఇలాంటి ప్రాచీనమైన విగ్రహాలను ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇవి మనుగడలోకి తీసుకు రాలేకపోతున్నాయనీ దీనిని మా భారతీయ జనతా పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్ ఊటు మహేందర్, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, నెన్నెల మండల అధ్యక్షులు అంగలి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి ఎనుముల వెంకటేష్, బిజెవైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్, నాయకులు పాల్గొన్నారు.





