Monday, March 23, 2026

మసీదు ప్రారంభోత్సవానికి విచేసిన పూజారి రాజు

  • హిందూ ముస్లిం భాయిభాయి అనే పదానికి అర్థంగా నిలిచిన చల్లూరు గ్రామస్తులు

నేటి సాక్షి, వీణవంక: జాతి మతం లేకుండా సర్వ మత సమ్మేళనం అనేది మన జాతికి ఎంతో ఉపయోగకరం. సర్వమత సమ్మేళనం అనగా ఎక్కడో కాదు మన వీణవంక మండలం చల్లూరు గ్రామంలో మసీదు ప్రారంభోత్సవానికి హిందూ పూజారిని ఆహ్వానించడం విశేషం. మసీదు కమిటీ ప్రెసిడెంట్ కమ్రుద్దీన్, ఆయుబ్ షరీఫ్, మొహసిన్ రఫీ, మథిన్నిస్సార్ వీణవంక మండల్ యువజన ఉపాధ్యక్షుడు మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ సోహెల్ వీరి ఆధ్వర్యంలో మసీదు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి రాజు మాట్లాడుతూ కరీంనగర్ శాస్త్రి రోడ్ యందు చేసే కార్యక్రమాలలోనూ, శనివారం అంగడి రోజు జరిపే అన్నదాన కార్యక్రమంలో ముస్లిం సోదరులు తనతో పాటు పాల్గొంటూ ఉంటారని అన్నారు. ఈ ముస్లిం సోదరులు నాకు మొదటి నుంచి పరిచయస్తులు వీరి యొక్క ప్రతీ కార్యక్రమంలో నేను పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బిజెపి నగర కార్యదర్శి హరికుమార్ గౌడ్, చల్లూరు పూజారి రాజుతో పాటు స్థానిక ముస్లిం మత పెద్దలు, మసీద్ కమిటి సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News