నేటిసాక్షి, కొడిమ్యాల : మండలంలోని తిప్పాయిపల్లి గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన ఇద్దరు చిన్నారులు దివ్య, మనిదీప్ లకు బుధవారం స్థానిక ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సత్యం 30వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. అనాధలుగా మారిన పిల్లలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న సత్యం తమ వంతు సాయం చేయడం పట్ల ప్రధానోపాధ్యాయుడిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మ్యాకల మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.





