Monday, March 23, 2026

క్యాన్సర్ తో ప్రైవేట్ ఉపాధ్యాయుడి మృతి

నేటి సాక్షి, జమ్మికుంట :
గత 30 సంవత్సరాలుగా జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుండ్ల రమేష్ (50) ఆదివారం సాయంత్రం క్యాన్సర్ తో మృతి చెందాడు. జమ్మికుంట పరిసర ప్రాంతాల్లోని సుపరిచితమైన వ్యక్తిగా, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా, వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత గుండ్ల రమేష్ కి చెందుతుందని, ఇటువంటి వ్యక్తి గత ఆరు నెలల నుంచి పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించడం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని కల్పించాలని ట్రస్మా మండల అధ్యక్షుడు డాక్టర్ పుల్లూరు సంపత్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News