Tuesday, March 10, 2026

ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

నేటిసాక్షి, నిజామాబాద్ బ్యూరో (టి.ఎన్. రమేష్):
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జన్మదిన సందర్భంగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటి వద్ద,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, పార్టీ బలోపేతానికై నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని, ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో చేపట్టిన, అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, బూత్ స్థాయి, కార్యకర్త నుంచి, నాయకుల వరకు అంతా మమేకమై, కష్టపడి పార్టీ నియమించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో, వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆయనతోపాటు నియోజకవర్గంలోని మండలాలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News