- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : వనపర్తి పట్టణం వెంగల్ రావు కాలనీ, సాయి నగర్ కాలనీ పార్క్ లో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీఓబీసీ సెల్ అధ్యక్షుడు కోట్ల రవి, శిరీష ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీల కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొనడం జరిగింది. ముగ్గులను చిన్నారెడ్డి పరిశీలించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు మొదటగా అడ్వాన్సుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజా ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగమే ఫ్రీ బస్సు, ఇందిరా క్యాంటీన్లను కూడా మహిళలకు కేటాయించిందని గుర్తు చేశారు. అలాగే మహిళలను కోటీశ్వరులుగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని అన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళ లను అభినందించడం జరిగింది. ముగ్గుల పోటీలో 47 మంది మహిళలు పాల్గొనగా అందులో మంచిగా ముగ్గు వేసిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. అమ్మపల్లె మొదటి విజేత కవిత ను శాలువతో సన్మానించి ఆరువేల ప్రైజ్ మనీని ఇచ్చారు. అలాగే మిగతా విజేతలకు చాలువతో సన్మానించి ఆర్థిక ప్రైజ్ మనీని అందజేశారు. ముగ్గుల పోటీలను నిర్వహించిన కోట్ల రవి శిరీష ని శాలువతో సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్, జిల్లా మత్స్యకార సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య, వనపర్తి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, వనపర్తి జిల్లా కి సమస్యల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, యూత్ కాంగ్రెస్ నాయకులు లాయర్ బాబా, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకిరాములు, కౌన్సిలర్ పరశురాములు, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు చరణ్, ఏఐపిసి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, శరత్,వెంకటేష్, అబ్దుల్లా, శరత్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

