- 122 దరఖాస్తుల స్వీకరణ
- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ): ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా , అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పెండింగ్లో పెట్టవద్దని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.





