Tuesday, March 10, 2026

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

పెప్సీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం.

నేటిసాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ:
సంఘటితంగా ఉండటం ద్వారా కుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాల ఐక్యత ఏర్పడుతుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హాస్ లో గురువారం పెరిక కుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పెప్సీ) క్యాలెండర్ ను కోదండరాం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ తో కల్సి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులగణన ద్వారా అన్ని వర్గాల నిష్పత్తి స్పష్టతకు వస్తుందని ఆశభావం వ్యక్తం చేసారు. పెరిక కులస్తుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కులగణన ద్వారా అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నకులగణన వ్యవహారం ఆషామాషీ కాదని పెప్సీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలుకు పూనుకున్నారని అన్నారు. మేమెంత ఉన్నామన్నది మాకు ఇప్పటికీ తెలువక, తమకు దామాషా ప్రకారం రావాల్సిన పదవులు, హక్కులు ఇప్పటికీ లభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక కుల వసతి గృహం వ్యవస్థపాక సభ్యులు, ఏడ్మా నర్సింగ రావు, పెప్సీ నాయకులు గుమ్మళ్ళ మల్లికార్జున్, రాష్ట్ర కోశాధికారి అప్పని సతీష్ కుమార్, ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అకా రాధాకృష్ణ, బేడుద వెంకటయ్య, శ్రీరామ్ వీరయ్య, మేడిశెట్టి శ్రీనివాస్ రావు, బోళ్ల వీర ప్రతాప్, రాందేని చంద్రమౌళి, శ్రీరామ్ సత్యనారాయణ, బండి శ్రీకాంత్, అచ్చ పరమేశ్వర్, బగ్గని జనార్ధన్, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు, పెప్సీ,పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News