బిజెపి మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి
నేటీ సాక్షి, ఇబ్రహింపట్నం :
సంక్షేమ పథకాలు అమలు పెరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుందనిజగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బాయి లింగరెడ్డి అన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతు తెలంగాణ రాష్టం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎర్పడి సవత్సరం గడుస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లతో పాటు కొత్త రేషన్ కార్డు లు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయటం లో విఫలమైందని, కాలయపచేసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో రేషన్ కార్డుల మీద నిబంధనలు పెట్టమేటని, గత 11సంవత్సరం నుండి రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడ గత ప్రభుత్వం లో దరఖాస్తు చేసుకున్న వారికే ఇస్తాం అనడం వీడురంగ ఉందని ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి కొత్తగా రేషన్ కార్డు లు ఇవ్వాలని ,ఏ నిబంధనలు పెట్టిన ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని, ఇబ్రహీంపట్నం మండలం లో జరుగుతున్న ఇంటిటి సర్వే లో రేషన్ కార్డు కొరకు దరఖాస్తులు తీసుకోవాలి అని ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.





