- సంతాపం తెలిపిన సీనియర్ జర్నలిస్ట్ బుర్ర రాజ్ కోటి గౌడ్
నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్): ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో ప్రొఫెసర్ గా సుదీర్ఘ కాలం పనిచేసి పదవి విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్న డా. సైండ్ల అంజయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజున తుది శ్వాస విడిచారు. సైండ్ల అంజయ్య స్వస్థలం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందినవారు. ఆయన గతంలో గన్నేరువరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు…ఆ తరువాత ఎలగందల్, చదువుకొని హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడి సుదీర్ఘ కాలం పనిచేసి కొన్నేళ్ల కిందటే పదవి విరమణ పొందారు. డాక్టర్ సైండ్ల అంజయ్య పలు డిగ్రీలు, డిప్లమాలు, డాక్టరేట్, లా చదివి ఎన్నో విజయాలను సాధించారు. యువత డాక్టర్ అంజయ్య ను ఆదర్శంగా తీసుకొని విజయాలు సాధించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బుర్ర రాజ్ కోటి గౌడ్ అంజయ్య కు నివాళులు అర్పించారు.




