Tuesday, March 17, 2026

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర ప్రొఫెసర్ జయశంకర్

  • శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీరాములు అందెల
  • అన్ని రంగాల్లో రాణించగల సత్తా విశ్వబ్రాహ్మణులకు ఉంది – శ్రీరాములు అందెల

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కలిసి శ్రీరాములుని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ…. అన్ని రంగాల్లో రాణించగల సత్తా విశ్వబ్రాహ్మణులకు ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను మరియు తెలంగాణకోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతా చారిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని గుర్తుచేశారు.వీరబ్రహ్మేంద్రస్వామి హిందూ ధర్మ రక్షకుడు అని సకల జనులహితం కోరిన గొప్ప సంఘసంస్కర్త అని ఈ సందర్భంగా స్మరించుకుంటూ మనమందరం సమ సమాజం బాటన నడవాలని కోరారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తుల ప్రోత్సాహకాలు అందించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో…. బడంగ్ పేట్ కార్పొరేషన్ 1 అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, ఇంద్రసేన, సహకార బ్యాంకు డైరెక్టర్ పెత్తుల పుల్లారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1 అధ్యక్షులు బిక్షపతి చారి, బిజెపి సీనియర్ నాయకులు రవికాంత్ గౌడ్, నర్సింగ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, బీజేవైఎం నాయకులు పవన్, శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ వ్యవస్థాపకులు జంగాచారి, సహాయ వ్యవస్థాపకులు రాజు చారి, అధ్యక్షులు సాయి ప్రశాంత్ చారి, ఉపాధ్యక్షులు నరేష్ చారి, సంయుక్త కార్యదర్శి సురేష్ చారి, శ్రీనివాస్ చారి, కోశాధికారి వెంకటాచారి, కార్యనిర్వాక కార్యదర్శి ఎస్ బ్రహ్మచారి మరియు విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News