నేటి సాక్షి, జమ్మికుంట :
జమ్మికుంట మున్సిపాలిటీ అదికారులు కొత్తపల్లి గ్రామస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యానికి నిరసనగా జమ్మికుంట పురపాలక కార్యాలయం ఎదుట కొత్తపల్లి గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ…గత పదిహేను రోజుల క్రితం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 17,20 వార్డులకు అనుకొని ఉన్న రైల్వే కాంపౌండ్ గోడకు ప్రక్కన మాస్టర్ ప్లాన్ ప్రకారం 12 ఫీట్ల దారి ఉన్నది. ఇప్పడు రైల్వే కాంపౌండ్ గోడకు ఉన్న చిన్న చిన్న దారులను రైల్వేఅధికారులు మూసివేస్తున్నారు. ఇందువలన కొత్తపల్లి గ్రామ ప్రజలు మరియు రైల్వే గోడకు దగ్గర ఉన్న ఇండ్ల యజమానులకు దారి లేక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేకాక రైల్వే పరిధిలో రైల్వే కాంపౌండ్ గోడకు ఆనుకుని 9 ఫీట్ల మోరీ నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై గత తేదీ 27-02-2025 రోజున జమ్మికుంట పురపాలక సంఘం కార్యాలయం కమీషనర్ కి రైల్వే కాంపౌండ్ గోడకు ఆనుకుని ఉన్న 12 ఫీట్ల దారిని నిబంధనల ప్రకారమే తీసి కొత్తపల్లి గ్రామ ప్రజలకు రాకపోకలకు అనుకూలంగా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ద్వారా కోరడమైనది. 15 రోజులు అయిన కూడా పురపాలక సంఘం అదికారులు సరైన రీతిలో స్పందించకుండా కాలయాపన చేస్తున్నందున కొత్తపల్లి గ్రామ ప్రజలు తీవ్రంగాఇబ్బందులుపడుతున్నారు. ఎందుకంటే రైల్వే అధికారులు మాత్రం వారి యొక్క పరిదిలో రైల్వే లైన్లు, మోరీ నిర్మాణం పనులను స్పీడ్ గా చేస్తున్నారు. ఇందు వలన కొత్తపల్లి గ్రామ ప్రజలు రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయిన కానీ పురపాలక సంఘం అదికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు.ఇందుకుగాను ఈరోజు పై విషయమై నిరసనగా కొత్తపల్లి గ్రామ ప్రజల అద్వర్యంలో జమ్మికుంట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ, జమ్మికుంట పురపాలక సంఘం అదికారులు ఎవరి ఒత్తిళ్ళకు భయపడకుండా నిబంధనల ప్రకారమే త్వరితంగా తక్షణమే రైల్వే కాంపౌండ్ గోడకు ఆనుకుని ఉన్న కొత్తపల్లి పరిదిలో ఉన్న 12 ఫీట్ల దారిని తీసి కొత్తపల్లి గ్రామ ప్రజలకు రాకపోకలకు అనుకూలంగా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము అని లేనియెడల పురపాలక సంఘం అదికారుల అలసత్వానికీ , నిర్లక్ష్యానికి నిరసనగా పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో కొత్తపల్లి గ్రామ ప్రజల అద్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టవలసి వస్తుందని తెలియజేస్తూన్నము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు MD . సలీం పాషా, గ్రామస్థులు రామంచ సాగర్,సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, జునూతుల మారుతి రెడ్డి, మేరుగురాహుల్, వంశీ , అయిలయ్యా, గాజుల స్వరూప, మేరుగు రేణుకా, యం.డి.అబేదా, ఝాన్సీ, రజిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



