నేటి సాక్షి, బెజ్జంకి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా గురువారం మండలంలోని బేగంపేట, గుడేం, వడ్లూర్ గ్రామశాఖల అధ్యక్షుల సమన్వయంతో బేగంపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్లూరి పరుశరాములు మాట్లాడుతూ జస్టిస్ సెమిమ్ అక్తర్ 10 తారీకు వరకు ఇవ్వాల్సిన కమిషన్ నివేదిక ప్రభుత్వం కు 5 రోజుల ముందే కమిషన్ నివేదిక యధాతధంగా ప్రభుత్వంకు ఇవ్వడం మాదిగలకు అన్యాయం చేయడమే అన్నారు.ఎస్సీ వర్గీకరణను ఏ బి సి డి గ్రూపులుగా కొనసాగించాలని, మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలని, రాబోయే మంత్రి వర్గ విస్తరణలో మాదిగ ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఇంచార్జి చింతకింది పర్శరాములు, సమన్వయ కార్యకర్త మంకాల బాలయ్య, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి కొమ్ము లక్ష్మణ్, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు బెజ్జంకి శంకర్, గుడేం గ్రామశాఖ అధ్యక్షులు మంకాల బాబు, వడ్లూర్ గ్రామశాఖ అధ్యక్షులు మంకాల స్వామి, సీనియర్ నాయకులు జనగాం శంకర్, బర్ల ఇస్తారి, బెజ్జంకి పోచయ్య, బర్ల శంకర్, మంకాల బాబు, భూపేందర్, జగ్గుల బాబు, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు



