Saturday, March 21, 2026

అర్హులైన అందరికీ రుణాలు అందించండి

  • డిప్యూటీ కమిషనర్ అమరయ్య

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య బ్యాంకర్లను ఆదేశించారు. వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల పంపిణీపై సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బ్యాoకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్, బ్రాహ్మిన్, ఈ.బీ.సీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య మరియు కాపు కార్పొరేషన్ల రుణాల మంజూరు పై చర్చించడం జరిగింది. ఈ రుణాల మంజూరుకు 2021 తర్వాత కులదృవీకరణ పత్రం తీసుకొని ఉండాలని, రేషన్ కార్డ్ పట్టణ పరిధిలోనే ఉండవలెనని తెలిపారు. బ్యాంకు మరియు బ్రాంచి వారిగా బీసీ కార్పొరేషన్ నందు సబ్ క్యాస్ట్ బిసి- ఏ, బి, డి & ఈ మరియు బ్రాహ్మణ, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, ఈ.బి.సి కార్పొరేషన్ మరియు కాపు కార్పొరేషన్ వారిగా టార్గెట్స్ ని విభజించి, బ్యాంకు, బ్రాంచ్ వారిగా ఇచ్చామని అన్నారు. యూనిట్లు ముందుగానే ఉన్నవారికి మరియు కొత్త యూనిట్లు (యూనిట్ ఏర్పాటుకు వీలున్న వారికి) కూడా మంజూరు చేయవచ్చునని తెలిపారు. కాపు కార్పొరేషన్ వారికి 50% సబ్సిడీ, మిగిలిన బిసి మరియు ఇతర కార్పొరేషన్ వారికి స్లాబ్ -1 : 0-15 లక్షలు 50% సబ్సిడీ, స్లాబ్ -2 : 1.25 లక్షలు/ 50% సబ్సిడీ, స్లాబ్ -3 : 2.00 లక్షలు/ 50% సబ్సిడీ,
కాపు కార్పొరేషన్:
స్లాబ్ -1 : 1.00 లక్షలు 50% సబ్సిడీ, స్లాబ్ -2 : 1.50 లక్షలు/ 50% సబ్సిడీ, స్లాబ్ -3 : 2.50 లక్షలు/ 50% సబ్సిడీ, జనరిక్ మెడికల్ షాప్ కు 4 లక్షలు,
MSME-10.00 లక్షల సబ్సిడీ అని తెలిపారు. ఇందులో ఏది తక్కువ ఉంటే వారికి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యల్.డి.యం. విశ్వనాథ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఆఫీసర్ బాబు రెడ్డి, మెప్మా సూపరింటెండెంట్ సుధాకర్, సి.యం.యం లు యస్.కృష్ణవేణి, యస్. సోమకుమార్, మరియు బ్యాంకర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News