నేటి సాక్షి, వేమనపల్లి : బుధవారం రోజున ఎంపీడీవో కుమారస్వామి,ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముల్కలపేట,దస్నాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న నర్సరీ,కాంపౌండ్ వాల్,పశువుల పాక పనులను పరిశీలించారు.అనంతరం వారికి త్వరగా పనులు పూర్తీ చెయ్యాలని ఆదేశించారు. నర్సరీలలో మొక్కల పెంపకం పట్ల నిర్లక్ష్యం చేయరాదని కోరారు. ఆ తర్వాత వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి అక్కడే మధ్యాహ్న భోజనం చేసారు.అనంతరం విద్యార్థుల వసతులు అడుగి తెలుసుకొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. వీరితో పంచాయతీ కార్యదర్శులు సురేష్, రజిత కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.





