- మద్దుకూరు గ్రామసభల్లో గ్రామస్తుల ఆవేదన అధికారులను నిలదీసిన గ్రామస్తులు
నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మన్నే వీరేంద్ర ప్రసాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయగా మండలంలోని గ్రామసభల నిర్వహణలో స్వల్ప ఉధృక్తత చోటుచేసుకున్నాయి మద్దుకూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ వి. జితేష్ పాటిల్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న అందరూ పథకాలను పొందుతారని కొంతమంది పేర్లు అర్హత ఉండి కూడా రానివారు గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియని ప్రతి ఒక్కరూ గ్రామ సభలో దరఖాస్తు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు గ్రామసభలలో అర్హుల పేర్లను ప్రకటించిన తర్వాత రైతు ఆత్మీయ భరోసా పథకంలో మాకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎటువంటి షరతులు లేకుండా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా అందించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు గ్రామస్తులకు మధ్య కొంత వాగ్వాదం జరగగా అధికారులు ప్రభుత్వ నిబంధన మేరకే అర్హులను ప్రకటించామని అర్హత ఉన్నవారు గ్రామసభలో దరఖాస్తు చేసుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి అశోక్ తహసిల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ అక్బర్ బాబు, ఏఈఓ, శ్రీనివాసరావు, ఈసీ నరేష్, పంచాయతీ సెక్రటరీ కృష్ణకుమారి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.





