Thursday, March 12, 2026

వృద్ధాప్యం లో ఉన్న కారంగుళ్ళ మల్లయ్యకు నిత్యవసర వస్తువులు అందజేత

  • రేండ్ల శారద కుమారస్వామి

నేటి సాక్షి,రామగిరి(కన్నూరి రాజు):
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో బీదస్తుడు అయిన కారంగుళ్ళ మల్లయ్యకు గతంలో వెన్నెముక ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అనంతరం ఉన్న సమస్యలతో నడవడానికి వీలు లేనంతగా కాళ్లు మొద్దు బారిపోయి నడవలేని పరిస్థితి ఉంది. ఇతరత్రా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న రేండ్ల శారద కుమారస్వామి అతనిని పరామర్శించి తన సొంత ఖర్చులతో 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేండ్ల శారద కుమారస్వామితో పాటు పడాల మొగిలి గౌడ్, కాట శంకర్ గౌడ్, తాటి శంకర్ గౌడ్, ముత్యం నాగరాజుగౌడ్, కరెంగుళ్ళ రాజు పాల్గొన్నారు. రేండ్ల శారద కుమారస్వామి చేసిన ఈ సహాయానికి కరెంగుళ్ళ మల్లయ్య నమస్కరిస్తూ మీరు చేసిన ఈ సహాయం మర్చిపోలేనని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో మంచి పనులు చేస్తున్న రేండ్ల శారద కుమారస్వామి ని అభినందించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News