నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో PRTU తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి షాహిన్ సుల్తానా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజకీయ, క్రీడా, అంతరిక్ష తదితర రంగాలలో మహిళలు ప్రతిభ కనబరుస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితా, మధుర హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రుక్మిణి పాల్గొని మహిళా సాధికారతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో PRTU తెలంగాణ మహిళా నాయకులు గాయత్రి, రజియా సుల్తానా, సుమిత్ర, పూర్ణిమ, ఉమారాణి, శోభారాణి, ఝాన్సీ, మాధవి, చంద్రకళ, ఫరీదా, లావణ్య, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.





