Sunday, March 22, 2026

బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ పరామర్శ

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): ఉమ్మడి వెల్గటూర్ మండలంలో గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు (పీఎస్ఆర్) పర్యటించి పలు కారణాలచే మరణించిన బాదిత కుటుంబాలకు పరామర్శ అందించారు. ముందుగా పాత గూడూరు గ్రామానికి చెందిన ఉష్కమల్ల రాజేశం అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ఓదార్పు అందించారు. అలాగే గొడిశెలపేట గ్రామానికి చెందిన యువరైతు ముస్కు రాజేంధర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. అనంతరం పాసిగామ గ్రామానికి చెందిన నలిమెల మల్లేష్ నానమ్మ రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్య క్రమంలో ఎలుక రాజు, లక్కాకుల శ్రీనివాస్, గెల్లు చంద్ర శేఖర్, చిలుముల విలాస్, బొడ్డు రామ స్వామి, జాడి రాజేశం, చంద్ర రెడ్డి, తంగళ్ళపల్లి చక్రపాణి, గోపు పోచయ్య, రంగు తిరుపతి, రాందేనీ కోటయ్య, అఖిల్, గోపతి నరేష్, మల్లేష్, పందిళ్ళ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News