- ఎన్డీఏ కూటమి బడ్జెట్ “అదుర్స్”
- “ఏపీ లో ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో సైతం సంక్షేమానికి పెద్దపీట” ఎన్డీఏ కూటమి ఘనత!
- బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రాష్ట్రంలో విద్య వైద్యం నీటిపారుదల వ్యవసాయ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు “అక్షయపాత్ర” లాంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బిజెపి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఏపీ సంక్షేమ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా,స్వర్ణాంధ్ర 2047 విజిన్ కల సాకారమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారని రైతులకు వడ్డీ లేని రుణాలు,అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ పథకాలకు 9400 కోట్లు ఉచిత పంటల బీమా కోసం1023 కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ ఉపాధి హామీకి ఎన్టీఆర్ జలసిరికి అగ్ర భాగం కేటాయించారన్నారు. హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల రంగానికి ఏపీ బడ్జెట్లో భారీ కేటాయింపులు శుభ పరిణామం అన్నారు. ఏపీ పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యాటక కేంద్రాలు రాబోతున్నాయని తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఏపీ కేంద్ర బిందువుగా మారబోతుందన్నారు. ప్రజారంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఎన్డీఏ కూటమి నేతలకు,సంపూర్ణ సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నవీన్ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.




