- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
ప్రజావాణిలో స్వీకరించిన వినతులను త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డి ఆర్ ఓ విజయలక్ష్మి వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి ఉమారాణి డిఆర్డిఓ కౌసల్య దేవి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి లతో కలసి ప్రజల నుండి పాలన సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో మొత్తం దరఖాస్తులు (103) రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భూ సంబంధిత సమస్యల పై 34, కలెక్టరేట్ 16, డిఆర్డిఓ- 4, జిడబ్ల్యూఎంసి -7, పోలీసు శాఖ-7, ధరఖాస్తులు, వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పైన దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించలేని దరఖాస్తులను ఆయా దరకాస్తుదారునికి స్పష్టంగా తెలియపరచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





