Wednesday, March 25, 2026

ఈనెల 03న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్)

నేటి సాక్షి, రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి అన్నమయ్య జిల్లా మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం దొరకని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంకు రాగలరు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 03 న సోమవారం ఉదయం 10.00 గం.ల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News