Thursday, March 12, 2026

పరిశుభ్రమైన వాతావరణం ద్వారానే ప్రజారోగ్యం పరిరక్షణ సాధ్యం

నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పూండి లో పరిశుభ్రమైన వాతావరణం ద్వారానే ప్రజారోగ్యం పరిరక్షణ సాధ్యమని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు మరియు మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ అన్నారు. శనివారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు ప్రజలు, ఇతర సిబ్బందితో కలిసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు సచివాలయం, అంగన్వాడి తదితర ప్రాంతాల్లో జంగల్ క్లియరెన్స్, కాలువల్లో పూడిక తీతలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ శ్రీను, లావేటి శంకర్, పాలిన చంద్రయ్య, పాలిన మోహన్ రావు, రత్నాల తుంభనాదం, దుర్యోధన, రాజు, సూరి, అప్పలస్వామి, కామేష్, చెంచు , నరేష్, వెంకట్ రావు, రెడ్డి మరియు సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News