నేటిసాక్షి, జమ్మికుంట:
2021 నుంచి రైతున్నేస్తం ఫౌండేషన్ వారు ఈ అవార్డును ప్రధానం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మిద్దెతోటలు, పెరటి తోటలు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. విషరసాయానిక ఎరువులు పురుగుమందులు వాడని ఆహార దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు పండించడాన్ని రైతూనేస్తం ప్రోత్సహిస్తున్నది. గత 10 సంవత్సరాలుగా తుమ్మేటి రఘోత్తమ రెడ్డి మిద్దెతోటలను పెరటి తోటలను విరివిగా ప్రచారం చేస్తున్నారు. వారి పేరున రైతున్నెస్తం ఒక అవార్డును నెలకొల్పింది. సోమవారం రోజున గుంటూరు సమీపంలోని కొర్నపాడు వద్ద గల రైతు నేస్తం కార్యాలయ ఆవరణలో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇందులో రెండు రాష్ట్రాల నుంచి 29 మందికి మరియు బెంగుళూరుకు చెందిన ఒకరికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.హెచ్ ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ గారు విశిష్ట అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లిరావు ఐ.ఏ.ఎస్. గారు ఆత్మీయ అతిథిగా తుమ్మేటి రఘోత్తమ రెడ్డిగారు పాల్గొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వర్ అధ్యక్షత వహించారు.