
నేటి సాక్షి, మునగాల : విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటన మండల పరిధిలోని వెంకట్రాంపురం లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చింత సైదులు సోమవారం ఉదయం రోజులాగే కూలి పనులకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు సాయంకాలం ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి 08:00 గ0, ప్రాంతంలో మొదట పగలురాగా, ఆ తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో ఉన్న బట్టలు, రూ. లక్ష నగదు, రెండు తులాల బంగారం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విలువైన డాక్యుమెంట్లతో పాటు నిత్యవసర వస్తువులు బూడిదయ్యాయి. కట్టు బట్టలతో కుటుంబం బజారు పడిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా లో రెండు పేసు ల కరెంటు రావడంతోనే మంటలు చెలరేగి పూరి గుడిసె పూర్తిగా కాలి బూడిద యిందంట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా బిందెల ద్వారా నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పి వేశారు. చింత సైదులు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.





