- మంచి జర్నలిస్టు మిత్రుడు ని కోల్పోయాం
- కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నేటి సాక్షి కోదాడ ప్రతినిధి: కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జర్నలిస్టు రఘు మృతి బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం రఘు దశదినకర్మలో భాగంగా పట్టణంలోనీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రఘు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రఘు పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించి అధైర్య పడవద్దు అని ఓదార్చారు. జర్నలిస్టుగా రఘు సుపరిచితులని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నిత్యం మాట్లాడే వారిని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక పనులు చేయించేవాడని పేర్కొన్నారు. పట్టణంలో, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారని అన్నారు. వారి కుటుంబానికి అని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



