- మత విద్వేషాలకు అతీతంగా సోదరభావంతో మెలగాలి
- ప్రజలు వదంతులు, పుకార్లను నమ్మరాదు
- సామరస్యంతో మెలగాలి
- ఇలాంటి సంఘటనలను వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు,నాయకులకు ఆపాదించడం బాధాకరం
- రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖమంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : మత సామరస్యానికి, ప్రశాంతతకు ప్రతీక రాయచోటి అని మత విద్వేషాలకు అతీతంగా సామరస్యం, సోదరభావంతో ప్రతి ఒక్కరు మెలగాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలో మంగళవారం జరిగిన ఘటన బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కొంత మంది ఆకతాయిలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడమే కాకుండా ఇతరులకు అసౌకర్యం కలిగించడం బాధాకరమన్నారు. శాంతియుతంగా కార్యక్రమాలు జరుపుకోవాలే తప్ప రెచ్చగొట్టే విధానాలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు పోలీసులు సమన్వయంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలందరూ సామరస్యంతో మెలగాలని ఆయన కోరారు. ఇరు వర్గాలకు చెందిన కొంత మంది ఆకతాయిలు అసంబద్ధమైన నినాదాలతో రెచ్చగొట్టి దాడికి పాల్పడడం మంచిది కాదన్నారు. ఇప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఎవరికైనా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించామన్నారు కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణం కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ప్రస్తుతం రాయచోటి పట్టణంలో ప్రశాంత వాతావరణం ఉంది. ఈ పరిస్థితిని చెడగొట్టడానికి కొంత మంది సత్యదూరం, అసంబద్ధమైన పుకార్లను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే కవ్వింపు చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ సంయమనంతో మెలగాలి. ఎలాంటి



