Thursday, March 19, 2026

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రాజన్న ఆలయ ఈవో వినోద్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : రానున్న మహాశివరాత్రి జాతర పర్వదినం నేపథ్యంలో బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో శ్రీ.కె వినోద్ సిబ్బందితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. కోడె క్యూ లైన్, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా చలువ పందిళ్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చే దిశగా గతంలో జరిగిన ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా దృష్టిలోకి తీసుకొని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వేములవాడ రాజన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. ఈవో వెంట ఈఈ రాజేష్, డీఈలు రఘునందన్ మైపాల్ రెడ్డి, ఏఈలు రామ కిషన్ రావు, లక్ష్మణరావు, ఏఈఓ శ్రావణ్ పర్యవేక్షకులు వరి నర్సయ్య సంజీవరావు ఆలయ సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News