నేటి సాక్షి, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన బోడపట్ల మొండయ్య, మల్లవ్వ దంపతుల చిన్న కూతురు రజిత నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎంపికైన సందర్భంగా గ్రామ కురుమ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్ హాజరై, అత్యంత వెనుకబడిన కుటుంబం నుండి రజిత అత్యున్నత స్థాయి ఉద్యోగం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల కష్టానికి ఇది ప్రతిఫలమని, పిల్లలు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడు వారికి నిజమైన ఆనందమని, ఇది తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని తెలిపారు. రజితకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక, రాజకీయ నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుల్ల పోచయ్య, పీపీఈల్ నాయకులు చిలుముల మోహన్, కురుమ సంఘం అధ్యక్షుడు పెద్ది మల్లేశం, పెద్దోళ్ల రాజు కుమార్, గుంటి మల్లయ్య, పర్స నాగరాజు, కొని శేఖర్ తదితరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





