Sunday, March 22, 2026

“శ్రీ లొంక రామన్న” జాతరకు రాంరెడ్డి నాయక్ రూ.1 లక్ష విరాళం

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ఆర్ సి ఇంచార్జి ( కోక్కుల వంశీ ) : మహా శివరాత్రి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలోని అందరి ఇలవేల్పు, గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడే దైవం, స్వయంభువు వెలసిన శ్రీ లొంక రామన్న స్వామి జాతరతో పాటు ఈ నెల27న అన్నదానం కార్యక్రమనికి గ్రామానికి చెందిన గుగులోత్ రాంరెడ్డి నాయక్ రానున్న “లొంక రామన్న స్వామి” వారి జాతర మహోత్సవానికి రూ. 1లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీ లొంక రామన్న స్వామి ఆలయకమిటీ సభ్యులు గుగులోత్ రాంరెడ్డి నాయక్ ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు రాంరెడ్డి కుటుంబంపై వుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ధర్మపురి జలంధర్ ,పులి హరిప్రసాద్, తోట్ల అంజయ్య, నరేందర్, సత్తయ్య మల్లేష్, మనోజ్, నడిపి మల్లయ్య శ్రీధర్, నరేష్, రవి, రామకృష్ణ మరియు ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News