
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.రంగులు పూయడం జరిగింది. ఈ సందర్బంగా సీపీ అధికారులు, సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందం తో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేసారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, హోలీ పండుగ మీ జీవితాలను ఈ రంగులమయం చేయాలని తెలిపారు. ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిప్ ఎ,బాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, గోద్వారిఖని ఎసిపి ఎం. రమేష్ , ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్ల రెడ్డి , ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, సిసి హరీష్, ఎస్.ఐ, ఆర్ ఎస్ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





