నేటి సాక్షి, కమలాపూర్:
మైనర్ బాలికపై రేప్ కేస్ విషయంలో 2018 సంవత్సరంలో జరిగిన ఘటనలో అక్కన్నపేట మండలంకు చెందిన నిందితుడిగా దాసరి సంపత్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు 27,000 జరిమానా విధించిన హనుమకొండ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ జడ్జి అపర్ణాదేవి. ఇట్టి కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏసీపి కే. సత్యనారాయణ, కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజామల్లారెడ్డి, నిందితుడికి శిక్ష పడడంలో తన వంతు పాత్ర వహించిన కోర్టు కానిస్టేబుల్ హరీష్ విక్రమ్ ని అభినందించడం జరిగిందని, బాధితురాలికి 2 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేయడం జరిగిందని కమలాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ. హరికృష్ణ తెలిపారు.

