Monday, March 23, 2026

రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి

  • ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో డ్రోన్ పిచికారీ ప్రదర్శన

నేటి సాక్షి, తిరుపతి జిల్లా చంద్రగిరి, (బాదూరు బాల) : రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి ఆధ్వర్యంలో చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి, భీమవరం, కొంగరవారిపల్లి గ్రామాలలో వ్యవసాయ డ్రోన్ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో జీవామృతం పిచికారీ పై అవగాహన కల్పించి వరి, మామిడిలో ప్రదర్శన నిర్వహించినట్లు కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఎస్. శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ పథకం మేనేజర్ షణ్ముగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. ప్రసాద రావు గారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆహారం పండించడంలో ప్రకృతి వ్యవసాయ యొక్క ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ధ్రువీకరణ, ప్రకృతి వ్యవసాయంతో వినియోగించే వివిధ జీవ, వృక్ష సంబంధ ఉత్పత్తులు తయారీ, వినియోగం మొదలైన అంశాల గురించి వివరించి, వ్యవసాయంలో నూతన సాంకేతికత వినియోగించటం వలన రైతులు శ్రమ తగ్గి మంచి ఆదాయం సాధ్యం అవుతుందని, కూలీల కొరత ప్రధాన సమస్యగా ఉన్న ప్రస్తుత కాలంలో రైతులు తప్పనిసరిగా వ్యవసాయ యాంత్రీకరణ వైపుగా ఆలోచించి ముందుకు సాగాలని తెలిపారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డా. ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు ,తిరుపతి జిల్లాలకు సంబంధించి భారతీయ వ్యవసాయ పరశోధనా మండలి, న్యూ ఢిల్లీ వారు వ్యవసాయ డ్రోన్ ల వినియోగాన్ని రైతులకు చేరవేయడానికి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ను ఎంపిక చేయటం జరిగిందని, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జిల్లాలోని వివిధ మండలాలలో రైతు పొలాలలో డ్రోన్ వినియోగించి ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సాంకేతికత గురించి ఆయన మాట్లాడుతూ డ్రోన్ వినియోగించి పిచికారీ ద్వారా నీరు, పురుగుమందు, కూలీల ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని, మామూలు పద్దతి కన్నా ఈ పద్ధతిలో పురుగుమందు ప్రభావం బాగా ఉంటుందని రైతులు ఈ నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తరువాత వ్యవసాయ డ్రోన్ ద్వారా 10 ఎకరాల వరి మరియు 5 ఎకరాల మామిడిలో జీవామృతం పిచికారీ చేయించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ పథకం మేనేజర్ శయముగం మాట్లాడుతూ.. నారావారిపల్లి క్లస్టర్ లో ప్రకృతి వ్యవసాయ పథకం కింద చేపడుతున్న వివిధ ప్రదర్శనా క్షేత్రాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. ప్రసాద రావు, ప్రకృతి వ్యవసాయ పథకం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షన్ముగం, రాస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు, శాస్త్రవేత్త శ్రీ రాము కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీ విజయ భాస్కర్, జిల్లా ప్రకృతి వ్యవసాయ పథకం సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News