- కులగణన సర్వేతో ప్రతి ఒక్కరికి లబ్ధి
- 10 ఏండ్ల పాలనలో బి.ఆర్.ఎస్ ఒక్క కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు
- 12 లక్షల 7 వేల 558 దరఖాస్తుల పెండింగ్ గత బి ఆర్ ఎస్ పార్టీ నిర్వాహకమే
- రేషన్ కార్డుల విషయం లో ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు
- అర్హులైన వారి రేషన్ కార్డు తొలగించే ప్రసక్తే లేదు
- రేషన్ కార్డుల దరఖాస్తులు నిరంతర ప్రక్రియ
- తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం
- క్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి
- మ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి); సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు..మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్,బిజెపి, లు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని అమలు పరచలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించారని బి.ఆర్.ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కొత్త కార్డులు అర్హులైన వారందరికీ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంటే హరీష్ రావు కేటీఆర్ తెల్లారి లేచింది మొదలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి తోడు బిజెపి అని అన్నారు. కుటుంబ ఆర్థిక స్థితి గతుల పైన అధికారులు స్వయంగా గ్రామాల్లోకి వచ్చి ఇల్లు ఇల్లు తిరుగుతూ బీసీ ఎస్సీ ఎస్టీ లపై సమగ్ర సర్వే చేస్తున్నారని రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ కార్డులో పేరు నమోదులు, తీసివేతలు చేపడుతున్నారని తెలిపారు. 18 లక్షల 515 మంది గతంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారని 12,07,558 మంది రేషన్ కార్డుల పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.10 ఎకరాల లోపు ఉన్న వారికి ఏడున్నర ఎకరాల పుష్కి మూడున్నర ఎకరాల తరి ఉన్న రైతులకు రేషన్ కార్డులు ప్రభుత్వం అందిస్తుందని దాదాపు పేదలందరికీ రేషన్ కార్డులు అందుతాయి అన్నారు. 12 సంవత్సరాల కాలంగా పెళ్లి అయిన నూతన దంపతులకు రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదని ప్రస్తుతం తాము ఆ దంపతులకు రేషన్ కార్డులను అందిస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు.గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు రాస్తారోకోలు ధర్నాలు చేస్తుందో తెలియడం లేదని, ఇందిరమ్మ ఇండ్లు రైతులకు భరోసా, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఏడాదికి రూ.12 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు గగ్గోలు పెడుతుందా అర్థం కావడంలేదని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు అందిస్తామని అనంతరం ప్రభుత్వమే స్వయంగా ఇంటి స్థలం అందించి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తుందని తెలిపారు. 29 రాష్ట్రాలలో రైతు కూలీలకు నెలకు ₹1000 ఇచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవని దేశవ్యాప్తంగా అది ఒక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డు రాలేదని ఏ ఒక్కరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని గ్రామ సభలలో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే అతి త్వరలో రేషన్ కార్డు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని తమ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి కార్డు అందించడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మినుపాల ప్రకాష్ రావు, ఈర్ల స్వరూప, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సారయ్య గౌడ్, సాయిరి మహేందర్, ధన నాయక్ దామోదర్ రావు, వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, చీకట్ల మొండయ్య, కల్లేపల్లి జానీ, పన్నాల రాములు, అమీర్ శెట్టి రాజలింగం, బిరుదు కృష్ణ, ముత్యాల రవీందర్ , తిరుపతి, మేకల పోచం, దున్నపోతుల రాజయ్య,ప్రేమ్ చందర్ రావు, రఫీక్,నల్లవెల్లి ప్రభాకర్, గుండా మురళి,గాదాసు రవీందర్, కుమార్ కిషోర్, ఈర్ల శేఖర్,లక్ష్మణ్,శోభ ల తోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




