Saturday, March 14, 2026

అర్హులు అయిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయలి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రము లో అర్హులు అయిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ఆవారి చందు వినతి పత్రం ఎమ్మార్వో కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో అవారి చందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అరకొరగా రేషన్ కార్డులు మంజూరు అయినట్టు లిస్ట్ లు ఇవ్వడం వలన గ్రామాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని అన్నారు.ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్, ఉపాధ్యక్షులు కూన రాజేందర్ మాటేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News