- వేమనపల్లి 2వ రేషన్ షాప్ లో అధికారులు తనిఖీ
- 9క్వింటాళ్ల 92 కేజీల రేషన్ బియ్యం మాయం
- డీలర్ పై కేసు నమోదు
నేటి సాక్షి, వేమనపల్లి : ప్రతినెల పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్ పేదల కడుపు కొడుతూ ప్రతినెల వచ్చిన బియ్యం దళారులకు అక్రమంగా విక్రయిస్తునట్లు డీలర్ పై విసుగు చెందిన గ్రామస్తులు సంబంధిత సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు.దీంతో సివిల్ సప్లై డీటీ పోషన్న,సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భూమేష్ ఆధ్వర్యంలో వేమనపల్లి రెండవ రేషన్ షాప్ తనిఖీ చేయగా 9 క్వింటాళ్ల 92కేజీల బియ్యం తక్కువ ఉండడంతో డీలర్ రామగిరి రావిపై 6A కేసు నమోదు చేసి,షాప్ సీజ్ చేశామని తెలిపారు.డీలర్ షాపును తాత్కాలికంగా గ్రామానికి చెందిన మొదటి రేషన్ డీలర్ కు అప్పగించారం.పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లు గానీ,రైస్ మిల్లర్లు గానీ పక్క దారి పట్టిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.





