- నవజాత శిశువులకు డా ఎన్ టి ఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత వైద్యసేవలు
- తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ పునర్జన్మ కల్పిస్తున్న డా. వాసుదేవరెడ్డి, డా. మౌనిక లు
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి పట్టణంలోని అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి ప్రేమను మరిపిస్తోంది. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతానికి చెందిన మహిళ 8 వ నెలలోనే ఉమ్మ నీరు పోవడం వల్ల అత్యవసర సీజేరియన్ ద్వారా శిశువు 1.40 కిలోల బరువుతో రాయచోటి పట్టణంలోని అమరావతి హాస్పిటల్ లోనే ఈనెల 22 వ తేదిన జన్మించారు.కాన్పును డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవ క్రింద ఉచితంగా చేశారు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డను చిన్నపిల్లల విభాగం వైద్యులు డా.వాసుదేవరెడ్డి, గైనకాలజిస్ట్ డా.మౌనిక లు పరిశీలించి శిశువును ఎన్.ఐ.సీ.యూ(నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు తరలించి వెంటిలేటర్ పైన పెట్టారు.అప్పటినుండి నిరంతరం పర్యవేక్షించి,కంటికి రెప్పలా వైద్యం అందిస్తూ వచ్చారు. రోజులు తిరిగే సరికి శిశువు బరువు 1.40 కిలో గ్రాముల నుంచి 1.50 కిలోలకు చేరుకోవడంతో ఆ తల్లిదండ్రుల మోముపై నవ్వు విరబూసింది.ఇలా తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు వెంటిలేటర్ సహాయంతో అమరావతి వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. గతంలో రాయచోటిలో ఈ సౌకర్యం లేక చాలా మంది గర్భవతులు,బాలింతలు తిరుపతి,బెంగళూరు,కడప లకు వెళ్ళ వలిసి వచ్చేది.ప్రస్తుతం రాయచోటిలో ని అమరావతి హాస్పిటల్ లోనే అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలలు తక్కువగా అతి తక్కువ బరువుతో జన్మించే శిశువులను రోజుల పాటు,నెలలపాటు ఎన్‌ఐసీయూలో పెట్టి సంరక్షించాలంటే ప్రయవేట్ గా అయితే రూ.లక్షల్లో ఖర్చవుతుంది.పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వారు ఇంత భరించలేరని, అలాంటి వారికి డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవ ద్వారా రాయచోటి పట్టణంలోని అమరావతి హాస్పిటల్ అండగానిలుస్తోందని హాస్పిటల్ గౌరవ సలహాదారులు కొండూరు శ్రీనివాసరాజు తెలియజేశారు. అమరావతి హాస్పిటల్ లో జరిగే ప్రసవాల్లో పుట్టేవారితో పాటు ఇతర ఆసుపత్రుల నుంచి శిశువులు తక్కువ బరువుతో పుట్టిన వారికి నాణ్యమైన వైద్యసేవలను ఇక్కడ అందిస్తున్నారని చెప్పారు.నవజాత శిశువుల సాధారణ బరువు 2.25 కిలోల వరకు ఉండాలి. తక్కువ బరువుతో పుట్టినవారిలో ఊపిరితిత్తులు,ఇతర శరీర భాగాల ఎదుగుదల సరిగా ఉండటం లేదని,ఇలాంటి వారిని వార్మర్లు, ఇంక్యుబేటర్‌లలో పెట్టి జాగ్రత్తగా సంరక్షిస్తుండటంతో పాటు సాధారణ బరువుకు చేరుకునే వరకూ చికిత్సలందిస్తున్నారని ఆయన వివరించారు.




