సధార్మట్ ముంపు భూమి సేకరణ.

నేటి సాక్షి,మెట్ పల్లి.(నరేష్.దులూరి):
ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ వద్ద నిర్మిస్తున్న సదార్మట్ బ్రిడ్జి ముంపుకు గురవుతున్న భూములను మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ శనివారం పరిశీలించారు.కోమటి కొండాపూర్ గ్రామ గోదావరి మధ్యలో ఉన్న భూ సేకరణలో భాగంగా గోదావరిలో నీరు ప్రవహించడంతో గ్రామానికి చెందిన ట్రాక్టర్ లో వెళ్లి జాయింట్ సర్వే నిర్వహించారు.సర్వేనెంబర్ 339 లో దాదాపు 36.39 ఎకరాల భూమిని సర్వే చేసి పరిశీలించినట్లు ఆయన తెలిపారు.ఆయన వెంట తహసిల్దార్ ప్రసాద్,సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.





