Wednesday, March 18, 2026

*REA రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం***************************

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)——————————————–ఈరోజు ఉదయం 10:30 గంటలకు పెన్షనర్స్ భవన్ నందు జిల్లా అధ్యక్షులు A.నరేందర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది.A.నరేందర్ రావు,కార్యదర్శి ఎన్నం రాంరెడ్డి మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనందున చాలామంది మానసిక ఒత్తిడికి లోనై అసులువాసినారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో తేదీ: 24 -12- 2025 రోజున నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఇట్టి సమావేశానికి రిటైర్డ్ బకాయిలు రానటువంటి ఉద్యోగులతో పాటు సర్వీస్ ఉద్యోగులు,పెన్షనర్స్ ఎక్కువ సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించడం జరిగింది.కావున ఇట్టి నిరాహార దీక్షకు ఎక్కువ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరనైనది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం రాంరెడ్డి, కోశాధికారి M.లక్ష్మినారాయణ, కమిటీ సభ్యులు G.దుబ్బయ్య, B.రాజేశం,A.చంద్రమౌళి,M.శంకరయ్య,K.సదానందచారి,T.గంగరాజo,K.నర్సింగరావు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News