
నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యం. పుస్తకాల విష్కరణలో పలువురు వక్తలు వాస్తవ జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యమని, అది ప్రజలను ఆలోచంపచేసి మార్పును వేగవంతం చేయగలదని నిన్న రాత్రి గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ అధ్యక్షతన జరిగిన బుద్ధుడి నుండి గద్దర్ వరకు, అస్పృశ్య యోధుడు పుస్తకావిష్కరణ ల సభలో పలువురు వక్తలు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం,బివివి ట్రస్టు సంయుక్త ఆధవర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య బిక్ష్మయ్య అస్పృశ్యత జీవితంపై రాసిన అస్పృశ్య యోధుడు పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆవిష్కరించగా, బొజ్జ బిక్షమయ్య లాల్ నీల్ ఐక్యతను కోరుతూ తన టీవీ ఇంటర్వ్యూల ద్వారా పులవురి తో చేసిన అంశాలతో ప్రచురించిన బుద్ధుడు నుండి గద్దర్ వరకు అనే పుస్తకాన్ని రాష్ట్ర కనీస వేతన కమిటి చైర్మన్ జనక్ ప్రసాద్ ఆవిష్కరించగా మొదటి పుస్తకాన్ని జర్నలిస్టు ఎం రాంమూర్తి, రెండవ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరస్వామి సమీక్షించారు. సమావేశంలో రచయితలతో పాటు అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేశ్, ప్రజానాట్యమండలి నాయకులు కె. స్వామి, బివివి నిర్వాహకులు వై.యాకయ్య,బొజ్జ రవికుమార్ లు, మిరయాల రాజిరెడ్డి,మాదన కుమారస్వామి, ఐ. కృష్ణ, జగదీశ్, సంకె రవి తదితరులు మాట్లాడారు. అస్పృశ్యత పై కె.స్వామి,కాసర్ల మల్లేశ్ లు పాడిన పాటలు అందరిని ఆలోచింప చేశాయి.





