Thursday, March 19, 2026

ప్రాంతీయ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హుజురాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు ఉన్నారు. డిఎంహెచ్వో వెంకటరమణ ప్రాంతీయ ఆసుపత్రి నందు ఉన్న వార్డులను ముఖ్యంగా పిఎన్సి వార్డు జనరల్ పేషంట్ వార్డు ఔట్ పేషెంట్ వార్డు సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ సమయపాలన పాటించాలని రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని అన్ని వైద్య సేవలు అన్ని పేషెంట్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఎన్సిడి వార్డును సందర్శించి హైపర్టెన్షన్ డయాబెటిస్ రోగులకు సరైన మందులు అందుతున్నాయా లేవా అని పరిశీలించారు. లేబర్ రూమ్ ఆపరేషన్ థియేటర్లను సందర్శించి ప్రసవాలు ఈమధ్య గణనీయంగా తగ్గాయని తిరిగి పెంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ ఆసుపత్రుల యందు అన్ని సౌకర్యాలను కల్పించి వైద్యాధికారులను తగిన వైద్య సిబ్బందిని నియమించారని వారందరూ పేద ప్రజల ఆరోగ్యం కొరకు నిరంతరం శ్రమించాలని ఆయనే చెప్పారు. ఆస్పత్రిలోని కొన్ని విభాగాల సిబ్బంది పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు తో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి ఆర్ఎంవోలు డాక్టర్ సుధాకర్ రావు డాక్టర్ నారాయణ రెడ్డి ఇతర వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి నుండి పెద్ద ఆసుపత్రికి వెళ్లే ప్రతి రోగి ఆర్ఎంఓ అనుమతితోనే వెళ్లాలని అని చెప్పారు రౌండ్ ది క్లాక్ ఆర్ ఎం ఓ లు డ్యూటీ చేయాలని ఆయన ఆదేశాలను జారీ చేశారు. గైనకాలజిస్టులకు ప్రసవాలు పెంచాలని పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలందించాలని చెప్పారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్ నాయక్ వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News