Tuesday, March 17, 2026

తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోండి

  • సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు

నేటి సాక్షి, చేర్యాల: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్. రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ కు సిద్దిపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలు బత్తుల మమతారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెడ్డి సామాజికవర్గం సభ్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంఘం మహిళా సభ్యులు సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జాగృతి అధ్యక్షులు బత్తుల మమతారెడ్డి, విజయ రెడ్డి, సూట్పల్లి బుచ్చిరెడ్డి, చేతి రెడ్డి సందీప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News