- MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ
నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MRO ఆఫీస్ ముందు మంగళవారం రోజున MRPS మండల అధ్యక్షులు ముత్యాల రమేష్ మాదిగ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ హాజరై రిలే దీక్షను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగస్టు 1-08-2024 న వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని చరిత్రలోనే వర్గీకరణ చేసిన తొలి ముఖ్యమంత్రిగా ఉంటానని,అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి వక్రీకరణకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తి చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవాలని,ఎస్సీ లా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, అమలు చేసే వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు నిలిపివేయాలని, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తీర్ణంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రిలే దీక్షలు ప్రారంభించడం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల సహనాన్ని పరీక్షించోద్దని రాబోయే రోజులలో మాదిగలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. రిలే దీక్షల కార్యక్రమంలో MSP జిల్లా ఉపాధ్యక్షులు చిలువేరు సంపత్ మాదిగ, MRPS మండల ఉపాధ్యక్షులు ఇసంపెల్లి రమేష్ మాదిగ, MRPS మండల కార్యదర్శి ఇసంపెల్లి రాజు కుమార్ మాదిగ, VHPS మండల నాయకులు శనిగరపు జనార్ధన్ మాదిగ, MRPS నాయకులు ఇసం పెల్లి ఐలయ్య మాదిగ, అల్లకొండ శంకర్ మాదిగ, వక్కల రమేష్ మాదిగ, అంకిల్ల రాజమల్లు మాదిగ, స్వామిమాదిగ, కుమార్ మాదిగ, నరేష్ మాదిగ, వీరేశం మాదిగ, రాకేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.



