నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆదివారం రోజు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ లలో వ్యవసాయ భూములు చేర్చడాన్ని, నిరసిస్తూ ఏడాదికాలంగా 8 విలీన గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆందోళన కారణంగా మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గి యూటర్న్ తీసుకున్నప్పటికీ అధికారికంగా మాస్టర్ ప్లాన్ రద్దును గజిట్ రూపంలో విడుదల చేయలేదు. దీని కారణంగా వడ్లుర్ ఎల్లారెడ్డి కి చెందిన యువరైతు శ్రీకాంత్ రెడ్డి అమర నిరాహారదీక్షకు పూనుకోగ, మూడవరోజు విలీన గ్రామాల రైతులు యువరైతు శ్రీకాంత్ రెడ్డి తో అమరన నిరాహార దీక్షను విరమింప చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మాస్టర్ ప్లాన్ పై రద్దు చేస్తూ జీవో విడుదల చేయకపోవడంతో 8 వీలిన గ్రామాల రైతులు ప్రజలు ఆదివారం రోజు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై మాస్టర్ ప్లాన్ రద్దు విషయమై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేయాలని రైతులు కోరుచున్నారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తూ కార్యాచరణ కొనసాగిస్తామని ఎంతటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని విలీన గ్రామాల రైతులు తేల్చి చెప్పారు.





